ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
దేశంలో రోజురోజుకు ఎబివిపి నాయకుల దాడులు పెరిగిపోతున్నాయని, ఎస్‌ఎఫ్‌ఐ నాయకునిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప, పట్టణ కార్యదర్శి విజరు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గురువారం రాత్రి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై జరిగిన దాడిని ఖండిస్తూ శుక్రవారం పట్టణంలోని వైఎస్‌ఆర్ సర్కిల్‌లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ ఈనెల 8 నుంచి 10 వరకు జరుగుతున్నాయని తెలిపారు. సంగారెడ్డిలోని గురువారం రాత్రి ఎస్‌ఎఫ్‌ఐ జెండాలు, తోరణాలతో ముస్తాబు చేస్తున్న నాయకులపై ఎబివిపి నాయకులు దాడి చేసి గాయపరిచారని చెప్పారు. ఆ దాడిలో సంగారెడ్డి జిల్లా కార్యదర్శి రమేష్ తలకు బలమైన గాయమైందని, ఇతర నాయకులకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. వారిని వైద్యం నిమిత్తం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారని చెప్పారు. దాడికి పాల్పడిన ఎబివిపి నాయకులను అరెస్టు చేసి తక్షణమే రిమాండ్‌కు తరలించాలని డిమాండ్ చేశారు. ఎబివిపిని దేశంలో లేకుండా బ్యాన్ చేయాలని తెలిపారు. రఘు, ఆనంద్, మోహన్, ప్రమోద్, పవన్, సుభానా పాల్గొన్నారు. ఆదోని పట్టణంలోని పోలీసు కంట్రోల్ రూమ్ సర్కిల్‌లో నిరసన చేపట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శ్రీనివాసులు, గణేష్ పాల్గొన్నారు










