Sep 08,2023 22:00

ఫొటో : ధర్నా నిర్వహిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ధర్నా
ప్రజాశక్తి-సంగం : తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడిపై ఎబివిపి నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ శుక్రవారం స్థానిక బస్టాండ్‌ సెంటర్లో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎబివిపి నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఎబివిపి పేరుతో ఉన్న ప్లకార్డును దగ్ధం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనీ యూనివర్సిటీలలో కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐకు ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక ఎబివిపి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. జిల్లాలో సంవత్సరానికి 15వేకు పైగా చదువు పూర్తి చేసుకొని నిరుద్యోగులుగా మారుతున్నారన్నారు. జిల్లాలో ఇప్పటికే అనేక రకాల పరిశ్రమల పేరుతో వేల ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుందన్నారు. మేం అధికారంలోకి వస్తే మెగా డిఎస్‌సి ప్రతి సంవత్సరం పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులను గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, ప్రభుత్వరంగ స్థలాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి వాగ్దానాలు చేసి ఉన్నారని, వాటి ఆచూకి ఎక్కడ కనిపించడం లేదని వాపోయారు.
స్థానిక సంస్థల్లో 75శాతం ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాట కూడా ఈ ప్రభుత్వానికి గుర్తుకు రాలేదని పేర్కొన్నారు. జిల్లా యువత ఉపాధి లేక పక్క రాష్ట్రాలలో పోయి పని చేసుకొనే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పరిశ్రమ ప్రాంతంగా మారిన ముత్తుకూరు మండలంలోని పరిశ్రమల పేరుతో రైతుల నుండి ప్రభుత్వం వేల ఎకరాలు భూమిని తీసుకున్నారని తెలిపారు. నేటికీ తీసుకున్న భూమి 30శాతం మాత్రమే పరిశ్రమలు నిర్మించారని తెలిపారు. ముఖ్యమైన డిమాండ్లు జిల్లాలో నగరంలో విఆర్‌ విద్యాసంస్థను ప్రభుత్వమే పూర్తి బాధ్యతలు తీసుకొని నడపాలన్నారు. హాస్టల్‌ పర్మనెంట్‌ వర్కర్స్‌ వార్డెన్‌ నిర్మించాలన్నారు. ప్రభుత్వం జూనియర్‌ కాలేజీలలో పాఠ్యపుస్తకాలు పంపిణీ మధ్యాహ్న భోజనం అమలు చేసి కొత్తగా మంజూరు చేసిన జూనియర్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. పీజీలో తీసుకువచ్చిన జిఒ నెంబర్‌ 77 ను రద్దుచేసి విద్య జీవన అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీహర్ష, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, సిపిఎం నాయకులు తోక మురళి, తదితరులు పాల్గొన్నారు.