ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా)
భారతి విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) కృష్ణాజిల్లా కమిటీగా ప్రచురించిన 2023 డైరీని కష్ణాజిల్లా డీఈవో తాహెరా సుల్తానా సోమవారం ఆమె ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తునే విద్యార్థులు చదువు వైపు ఆకర్షించే విధంగా వివిధ రకాల పోటీలు నిర్వహిస్తూ విద్యార్థులను చైతన్య పరుస్తున్న ఎస్‌ఎఫ్‌ఐకి అభినందనలు తెలియజేశారు. విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపేందుకు సదస్సులు, సెమినార్లు నిర్వహించాలని సూచించారు. డైరీ ఆవిష్కరించిన వారిలో అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ యం.ఎ అజీజ్, సూపరింటెండెంట్ నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పవన్ కుమార్, అధ్యక్షుడు సుఖేష్, మచిలీపట్నం నాయకులు కీర్తి తదితరులు పాల్గొన్నారు.










