Oct 09,2023 00:18

పిడుగురాళ్ల: భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఎస్‌ఎఫ్‌ఐ బ్రాహ్మణపల్లి గ్రామ కమిటీ ఆదివారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్ను కున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పల్నాడు జిల్లా కార్యదర్శి కోట సాయికుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని విద్యార్థుల సమస్యలపై భవి ష్యత్తులో మనమందరం కలిసి పోరాడాలని అన్నారు.ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఇంతవరకూ పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదని అన్నారు. జీవో నెంబర్‌ 77 రద్దు చేయాలని, పీజీ చదువుకునే వాళ్లకు విద్యాదీవెన,వసతి దీవెన ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం 20 మంది విద్యా ర్థులతో నూతన కమిటీని ఎన్నుకున్నారు.అధ్యక్ష కార్యదర్శులుగా జె. సంతోష్‌ కుమార్‌, ఎల్‌.బెన్నీ, ఉపాధ్యక్షులుగా పి.జానీ భాష, ఎస్‌.కె. ఇర్ఫాన్‌, సహాయ కార్యదర్శులుగా వై.తేజ ప్రభాస్‌, జె. శివకోటి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా కార్య దర్శి, డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు యాసిన్‌, మనీ, రామకృష్ణ ఎస్‌ఎఫ్‌ఐ నూతన కమిటీ నాయకులు పాల్గొన్నారు.