Jul 12,2023 23:50

ప్రజాశక్తి-గుంటూరు : స్థానిక ప్రభుత్వ మహిళా జూనియర్‌ కాలేజీలో భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో బుధవారం మలాల డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నగర గరల్స్‌ కన్వీనర్‌ బి.సుచరిత మాట్లాడుతూ ఆడపిల్లలందరికీ విద్యను అందించాలని పాకిస్తాన్‌లో 14 ఏళ్ల వయస్సులో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రాణాలను సైతం లెక్కచే యకుండా పోరాడి సాధించిం దన్నారు. నేడు మలాల పోరాట స్ఫూర్తి ప్రపంచ వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వాలు బాలికా విద్యను ప్రోత్సహించటంలో అనేక లోపాలున్నాయన్నారు. మలాల స్ఫూర్తితో బాలికా విద్య కోసం కృషి చేయాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆరిఫా, మౌనిక, తులసి, వాసంతి, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
ప్రజాశక్తి-సత్తెనపల్లి : స్థానిక బాలికల జెడ్‌పి పాఠశాలలో ఐద్వా ఆధ్వర్యంలో మలాలా డే నిర్వహించగా ఐద్వా పట్టణ కార్యదర్శి గద్దె ఉమాశ్రీ మాట్లాడారు. ఆయుధం కాదు కలం పట్టాలి, పుస్తకం పట్టాలి అని ఉద్యమించిన మలాలాను విద్యార్థినులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.