ప్రజాశక్తి - కొల్లూరు
మండలంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన్ నిర్వహించారు. డ్రగ్స్, అత్యాచారాలను అరికడదాం, మానవత్వాన్ని సాటుదాం అనే నినాదంతో తయారు చేసిన రాఖీలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఉడా చైర్మన్ దేవినేని మల్లికార్జునరావుతోపాటు మండలంలోని విద్యాసంస్థల ప్రముఖులకు రాఖీలను కట్టి మహిళలు, చిన్నారులకు అండగా ఉండాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మెరుగు నాగార్జున మాట్లాడుతూ యూనివర్సిటీలో చదువుకున్న రోజుల్లో విద్యార్థి సంఘాల్లో పనిచేసిన సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఎస్ఎఫ్ఐ వంటి సంఘాల్లో పని చేయడంతోపాటు చదువులో కూడా ముందుండాలని అన్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల గర్ల్స్ కన్వీనర్ స్రవంతి, బాపట్ల జిల్లా అధ్యక్షులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ నేరాలకు ప్రధానమైన డ్రగ్స్, మద్యం అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వరుణ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బొనిగల సుబ్బారావు, ఎస్ఎఫ్ఐ నాయకులు భాగ్యశ్రీ, యమున, శివ, నందిని, ప్రసన్న పాల్గొన్నారు.










