ప్రజాశక్తి బాపట్ల
భారత విద్యార్థి ఫెడరేషన్ బాలికల టీం ఆధ్వర్యంలో బుధవారం రాఖీ పండుగను బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆర్య మాట్లాడుతూ అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి రాఖీ పర్వదినం సందర్భంగా డ్రగ్స్ నిర్మూలనకై ప్రతిజ్ఞ చేశారు. ఆడపిల్లలను కాపాడుకుందాం అనే నినాదంతో రాఖీ పండుగ జరుపుతున్నామన్నారు. సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యలకు కారణభూతమైన మద్యం, మత్తు పదార్ధాలను నివారించడంలో ప్రభుత్వం విఫలం అవుతోందని, వాటిని పూర్తిస్థాయిలో నిషేధించేందుకు కషి జరగాలన్నారు. జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా , ఎస్ ఎఫ్ ఐ నాయకులతో కలిసి డ్రగ్స్‌కి వ్యతిరేకంగా రాఖీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చామకూరి శ్రీధర్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మనోజ్ విద్యార్థులు పాల్గొన్నారు.










