ప్రజాశక్తి - వన్‌టౌన్
భారత విద్యార్థి ఫెడరేషన్-ఎస్‌ఎఫ్‌ఐ విజయవాడ పశ్చిమ నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇంటర్మీడియట్ చదువుతున్న పేద విద్యార్థులకు జె.ఈ.ఈ మెయిన్స్ అడ్వాన్సుడ్ పుస్తకాలును ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఎం. సోమేశ్వరరావు, 50వ డివిజన్ కార్పొరేటర్ బోయి సత్యబాబు పాల్గొని కొత్తపేటలో గల మోటూరు హనుమంతరావు శ్రామిక భవన్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న పేద విద్యార్థులకు జె.ఈ.ఈ మెయిన్స్ అడ్వాన్సుడ్ పుస్తకాలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎం. సోమేశ్వరరావు మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు సమస్యల మీద పోరాటమే కాకుండా ప్రతి విద్యా సంవత్సరం పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ (మరియు) సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఎస్‌ఎఫ్‌ఐ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. కార్పొరేటర్ బోయి సత్యబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, మధ్యతరగతి విద్యార్థులకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ -(2020) పేరుతో విద్యను దూరం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పశ్చిమ నగర అధ్యక్షులు బాలు, ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు జి.గోపి నాయక్, విజయవాడ నగర నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.










