నిరసన తెలుపుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు
ప్రజాశక్తి-సాలూరు : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులపై లాఠీఛార్జీకి వ్యతిరేకంగా బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి నితిన్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఎఎన్‌ఎంలను నియమించాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పారు. దీని వల్ల వసతిగృహాల్లో విద్యార్థులు జ్వరాలతో మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. డైట్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అఖిల్, గౌరీ పాల్గొన్నారు.










