Nov 17,2023 19:10

నిరసన వ్యక్తం చేస్తున్న ఎస్‌డబ్ల్యుఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-నెల్లూరు :నెల్లూరు ఆర్‌టిసి 2 డిపో మేనేజర్‌ కార్మికుల పట్ల అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్‌టిసి 2 డిపో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కమిటీ నాయకులు మాట్లాడుతూ డ్రైవర్లు ను బలవంతంగా టీమ్స్‌ సర్వీసులకు పంపడం దారుణమన్నారు. డ్రైవర్లు టిమ్స్‌ సర్వీసులు నడపడం తమకు కష్టంగా ఉంటుందని, తమకు అటువంటి డ్యూటీల నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తే అందుకు అంగీకరించకుండా ఆబ్సెంట్‌ వేసి జీతం కట్‌ చేసి ఆర్థికంగా నష్ట పరుస్తున్నారన్నారు. ముఖ్యంగా పల్లె వెలుగు డ్రైవర్లు ను రోడ్డు బాగలేక పోయిన కెఎంపిఎల్‌ పేరుతో డ్రైవర్లు ను వేదింపులకు గురిచేయడం సరికాదన్నారు. ఆర్‌టిసిలోని 55 సం''లు నిండిన డ్రైవర్లు ను సుదూర ప్రాంతాలకు పంపించరాదని సర్కులర్లు ఉన్నప్పటికీనీ, సర్కులర్లు ఉల్లంఘన చేస్తూ డ్రైవర్లు ను పంపిచడాన్ని డిపో కమిటీ వ్యతిరేకిస్తుందన్నారు. ప్రస్తుతం నడుస్తున్న నాలుగు తిరుపతి సర్వీసు లను మంచి ఈపికె వస్తున్నా డబ్బులు రావడంలేదని ,సర్వీసులను సక్రమంగా నడపక ప్రయాణికులకు అసౌకర్యం కల్గించటమే కాకుండా వాటిని రద్దు పరచటం న్యాయం కాదన్నారు.అంతే కాకుండా గ్యారేజ్‌ నందు సరైన సిబ్బంది లేనప్పటికీ, అక్కడ పని చేస్తున్న సిబ్బంది పై పనిభారం మోపుతూ, గ్యారేజ్‌ నందు సరిపడా స్పేర్‌ పార్ట్స్‌ లేక, సరైన టూల్స్‌ లేక మానసికగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తు వేదింపులకు పాల్పడటం సరికాదన్నారు. వారం రోజుల క్రితం బస్సుల మెయింటెన్స్‌ బాగాలేదని ఇద్దరు మెకానికల్‌ లను వారి సంజాయిషీ అడగకుండానే వారిని అక్రమంగా కందుకూరు డిపో కు బదిలీ చేయటం దుర్మార్గమన్నారు. వారిని తిరిగి నెల్లూరు 2 డిపో తీసుకొని రావాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమాన్నికి 50 మంది కార్మికులు డిపో అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌కె ఖాయ్యుమ్‌, కె. చంద్రయ్య, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ఎన్‌. రాజశేఖర్‌, ఎ.కష్ణయ్యలు పాల్గున్నారు.