ప్రజశక్తి - చీరాల
ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆవిర్బావం జరిగాకే ఆర్టీసీలో ఐక్య ఉద్యమాలు పెరిగాయని యూనియన్ సీనియర్ నాయకులు బొమ్మిడి శ్రీనివాసరావు అన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఎస్డబ్ల్యుఎఫ్ ఆవిర్భావ దినోత్సవం స్థానిక కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. డిపో కమిటీ అధ్యక్షులు కెబికె రెడ్డి జెండా ఆవిష్కరించారు. సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం వసంతరావు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో రాయితీలు రావడంలేదని అన్నారు. ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తుందని అన్నారు. ట్రేడ్ యూనియన్ హక్కులను కాల రాస్తున్నారని అన్నారు. చేతి వృత్తి సంఘం నాయకులు పి కొండయ్య మాట్లాడుతూ ప్రతి సంఘానికి యాజమాన్యంతో మాట్లాడే హక్కు ఉందని అన్నారు. కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులు విధిగా ఉంటారని అన్నారు. కార్మిక సమస్యలను కేంద్ర కార్మిక సంఘాలు వాటి నాయకులతో యాజమాన్యాల చర్చలు నిర్వహిస్తారని అన్నారు. సమస్యలు పరిష్కారం చేస్తారని అన్నారు. ఇవి కార్మిక సంఘాలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఔట్సోర్సింగ్ కార్మికులకు కూడా ఈ హక్కులు వర్తిస్తాయని అన్నారు. చీరాల ఆర్టీసీలో హెయిర్ బస్ కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. వారితో సమస్యలు చర్చించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తులసిరావు, రాంబాబు, జయరావు, నాగిరెడ్డి పాల్గొన్నారు.










