Apr 23,2023 00:44

మాట్లాడుతున్న బ్యాంక్‌ అధికారులు

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:స్థానిక కళ్యాణ మండపంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఖాతాదారుల కనెక్ట్‌ సదస్సును ఏర్పాటు చేశారు. భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ మెయిన్‌ బ్రాంచ్‌ నర్సీపట్నం ఆధ్వర్యంలో ఎస్‌ఎంఈ కనెక్ట్‌ ఖాతాదారుల సదస్సును బ్రాంచ్‌ చీప్‌ మేనేజర్‌ ఎంఏ స్వరూప్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏజీఎం శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్‌ మేనేజర్‌ స్వరూప్‌ మాట్లాడుతూ, ఖాతాదారులకు ఎస్‌ఎంఈ ద్వారా సేవల అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బ్యాంకు ద్వారా ముద్ర లోన్లు కొత్తగా వ్యాపారాలు పెట్టే వారికి, కొత్తగా పెట్రోల్‌ బంకులు పెట్టే వారికి ఎటువంటి షూరిటీలు లేకుండా లోన్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. డిజిటల్‌ పేమెంట్స్‌ బ్యాంకు అందించే స్కీములపై వివరించారు. ఖాతాదారులకు మరెన్నో సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.