Aug 16,2023 21:46

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
            భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఫైనల్‌ ఇయర్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఈదర సాత్వికకు, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థిని దేవులూరి రాజరాజేశ్వరికి ఓరుగంటి సుందరి మెరిటోరియస్‌ అవార్డు కింద ఒక్కొక్కరికి రూ.25 వేల నగదు బహుమతి అందించినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం.జగపతిరాజు చెప్పారు. స్థానిక కళాశాలలో స్కాలర్‌షిప్‌ మాన్యువల్‌ చెక్కును బుధవారం అందించారు. ఈ సందర్భంగా అలుమిని అసోసియేషన్‌కు చెందిన డాక్టర్‌ వికె.విశ్వనాథరాజు మాట్లాడుతూ అమెరికాలో ఉన్నత స్థానంలో ఉన్న కళాశాల పూర్వ విద్యార్థి ఇసిఇ చదివిన ఓరుగంటి శివభరత్‌ ఈ స్కాలర్‌షిప్‌ ఏర్పాటు చేశారన్నారు. ప్రతి ఏటా మూడో సంవత్సరం నాటికి ఇసిఇ విభాగంలోని టాపర్‌, మిగిలిన అన్ని బ్రాంచీలోని టాపర్‌కు ప్రతి ఏటా ఒక్కొక్కరికి రూ.25 వేలు నగదు బహుమతి పంపిస్తున్నారని చెప్పారు. గత 15 ఏళ్లుగా చేస్తున్న కృషి మెరిట్‌ విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. కళాశాల ఉపాధ్యక్షులు ఎస్‌వి.రంగరాజు చేతులమీదగా విద్యార్థినులకు నగదు చెక్కులను అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కెవి.మురళీకృష్ణమరాజు, ప్రొఫెసర్‌ పి.సుబ్బారావు, ఎఎస్‌సి హెడ్‌ డాక్టర్‌ వి.చంద్రశేఖర్‌, ఇసిఇ విభాగం హెడ్‌ డాక్టర్‌ ఎన్‌.ఉదరుకుమార్‌ పాల్గొన్నారు.