ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : దేశ పటిష్టతకు భవిష్యత్తుకు ఆలంబన క్రీడలేనని ఏలూరు రేంజ్ డి.ఐ.జి. అశోక్ కుమార్ అన్నారు. స్థానిక శేషాద్రి రావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం జాతీయ స్థాయి క్రీడా పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఏలూరు రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ జి.వి.జి. అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి డాక్టర్ నైనా జైస్వాల్ గౌరవ అతిధిగా విచ్చేశారు. ముఖ్య అతిధి జి.వి.జి. అశోక్ కుమార్ జాతీయ పతాకాన్ని, గౌరవ అతిధి నైనా జైస్వాల్ రజతోత్సవ పతాకాన్ని, కళాశాల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రావు వల్లూరుపల్లి కళాశాల పతాకాన్ని ఆవిష్కరణ చేశారు. డిఐజి. అశోక్ కుమార్ కు కళాశాల క్రీడాకారులు సుష్మా, సోమనాథ్ లు కాగడాను అందించగా క్రీడా జ్యోతి ని వెలిగించి రజతోత్సవ జెక్ ఫెస్ట్ 23 జాతీయ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. తదుపరి కళాశాల చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరావు వల్లూరుపల్లి ఎస్.ఆర్.జి.ఈ.సి. రజతోత్పన వేడుకల ప్రాముఖ్యతను, జెక్ పెస్ట్ పేరిట నిర్వహించే కార్యక్రమాల విశిష్టతను సభకు పరిచయం చేశారు. జాతీయ స్థాయి క్రీడా పోటీల కో-ఆర్డినేటర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. కోదండ రామారావు క్రీడా పోటీల నివేదికను, కన్వీనర్, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.వి.ఎస్.ఎన్.ఆర్.వి. ప్రసాద్ రజతోత్సవ వేడుకల నివేదికను చది వారు. ఈ జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుండి 52 ఇంజనీరింగ్ కళాశాలల నుండి సుమారు 1150 మంది క్రీడాకారులు వివిధ క్రీడలైన వాలీబాల్, బాస్కెట్ బాల్, ఖో ఖో, కబడ్డీ, రూప్ స్కిప్పింగ్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్ లో పాల్గొన్నారని, ఈ పోటీలు మహిళలకు, పురుషులకు వేరువేరుగా నిర్వహిస్తున్నామని 170 పురుషుల టీంలు, 110 మహిళల టీంలు వచ్చాయని క్రీడా పోటీల ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎం శివశంకర్ తెలిపారు. కళాశాల చైర్మన్ డాక్టర్ వల్లూరుపల్లి నాగేశ్వరరావు, కో చైర్మన్ ముసునూరి శ్రీనివాసరావు, సెక్రెటరీ అండ్ కరస్పాం డెంట్ పుల్లూరు పల్లి సత్యనా రాయణ, కో సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ వల్లూరుపల్లి రామకష్ణ, ప్రమోటర్ సొసైటీ అధ్యక్షులు వల్లభనేని సుబ్బారావు పాల్గొన్నారు.