Oct 15,2023 00:32

పరీక్ష కేంద్రాల వద్ద పరిశీలనలో ఐజి

ప్రజాశక్తి-గుంటూరు సిటి : గుంటూరు రేంజ్‌ పరిధిలో రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్‌ బోర్డు శని ఆదివారాల్లో నిర్వహిస్తున్న ఎస్‌ఐ తుది రాత పరీక్షల కేంద్రాలను రేంజ్‌ ఐజి పాల్‌రాజు, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల ఎస్పీలు ఆరిఫ్‌ ఆఫీజ్‌, రవిశంకర్‌రెడ్డి, వకుల్‌ జిందాల్‌ శనివారం పరిశీలించారు. టిజెపిఎస్‌ కాలేజీ, ఆర్‌విఆర్‌ అండ్‌ జెసి కాలేజీ, ఏసీ కాలేజీ, విజ్ఞాన్‌ నీరుల, విజ్ఞాన్‌ డిగ్రీ కాలేజీల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో తొలిరోజు 7,145 మంది పరీక్షలుకు హాజరవ్వాల్సి ఉండగా నూరు శాతం హాజరు నమోదైంది. కేంద్రాల వద్ద అభ్యర్థుల ఫొటోలు, గుర్తింపు కార్డులతోపాటు బయోమెట్రిక్‌ను కూడా పరిశీలించాకే అధికారులు లోపలికి అనుమతించారు.