గుంటూరు జిల్లా ప్రతినిధి: రేంజ్ పరిధిలో యస్ ఐ పోస్టులకు నియామక పక్రియలో భాగంగా అర్హత సాధించిన అభ్యర్థులకు దేహధారుడ్య పరీక్షలు గుంటూరు పోలీసు పేరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. డిఐజి పాల్ రాజ్, ఎస్‌పి ఆరీఫ్ హఫీజ్ శుక్రవారం ఇందుకు సంబంధించిన తుది ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 100 మీటర్ల పరుగు పందెం,1600 మీటర్ల పరుగు పందెం, ఎత్తు , బరువు, ఛాతి కొలతలు, లాంగ్ జంప్ చేసే తీసుకునే ప్రతి ప్రదేశం క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్థులకు ఎలాంటి అంతరాలు అటంకాలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. దేహాదారుడ్య సామర్థ్య పరీక్షలను ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా పోటీలు నిర్వహించేందుకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు ఆయన మీడియాకు తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు ఆయా ప్రాంతాల్లో మెడికల్ విభాగము అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షను పూర్తి చేసిన అభ్యర్ధులకు ఫిజికల్ మెజర్ మెంట్, ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. గుంటూరు రేంజ్ పరిదిలో 12 వేల 957 మంది అభ్యర్దులు పాల్గొంటు న్నారు. వీరిలో 1909 మంది మహిళా అభ్యర్దులు ఉన్నారు. దేహ దారుడ్య పరీక్షలలో పాల్గొనేందుకు ముందుగానే అభ్యర్థులకు సమాచారం పంపారు. ప్రతి రోజు రోజూ ఉదయం 5 గంటల నుండి దేహదారుడ్యల పరీక్షల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ప్రతిరోజు అభ్యర్ధులకు మొదటగా సర్టిఫికెట్స్ పరిశీలన చేస్తారు.ఎత్తు, చాతీ వంటి ఫిజికల్ మెజర్ మెంట్స్ చేస్తారు. తర్వాత బయోమెట్రిక్ తీసుకుంటారు. దేహదారుడ్య పరీక్షలలో భాగంగా 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహిస్తారు. దేహ దారుఢ్య పరీక్షల దగ్గర ఎక్కడ కూడా ఏలాంటి ఆరోపణలు, పొరపాట్లకు తావు లేకుండా ఆధునిక కంప్యూటరైజ్డ్ టెక్నాలజితో డిజిటల్‌గా, పారదర్శకంగా ఈ వెంట్స్‌కు సంబంధించిన పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎస్సై అభ్యర్ధులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తామంటూ దళారుల మాటలు నమ్మవద్దని , ప్రలోభాలకు గురికావద్దని కోరారు. ఆగష్టు 26 వ తేది నుండి సెప్టెంబర్ 16 వ తేది వరకు గుంటూరు పెరేడ్ గ్రౌండ్స్ మైదానంలో ఈవెంట్స్ జరుగుతాయని తెలిపారు. గుంటూరు రేంజ్ పరిధిలో జిల్లాల ఎస్పీల సహాకారంతో పోలీసు సిబ్బంది రోజు ఉదయం 4 గంటల నుండి విధులు నిర్వహిస్తున్నారు. పరుగు పందెంలో పాల్గొనే అభ్యర్ధులకు అత్యవసర పరిస్ధితులలో ఏదైనా జరిగితే అంబులెన్స్, డాక్టర్స్ వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. దేహాదారుడ్యు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు వెరిఫికేషన్ కోసం ఖచ్చితంగా ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని, లేటెస్ట్ కుల ద్రువీకరణ సర్టిఫికెట్, క్రిమిలేయర్ సర్టిఫికెట్ తీసుకురావాలి. వాటితో పాటు ఆధార్, అడ్మిట్ కార్డు, స్టడీ, మార్కిలిస్టులు, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు జిరాక్స్ సర్టిఫికెట్లు (గెజిటెడ్ సంతకం) తప్పనిసరిగా తీసుకుని రావలెనని తెలిపారు. అదే విధంగా శుక్రవారం రావాల్సిన అభ్యర్థులు వచ్చేనెల 16న దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలియజేశారు. గుంటూరు జిల్లా ఎస్‌పి ఆరీఫ్ హఫీజ్, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కే కోటేశ్వరరావు, ఒంగోలు అదనపు ఎస్పీ అశోక్ బాబు గారు, రేంజ్ పరిధిలో డిస్పీలు, సిఐలు పాల్గొన్నారు.










