Jul 20,2023 21:34

నిల్వలను తనిఖీ చేస్తున్న అధికారులు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ప్రత్తిపాడు, వట్టిచెరుకూరులోని 3 ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో విజిలెన్సు అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. అనుమతి లేకుండా విక్రయిస్తున్న ఎరువులు, పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు. రికార్డులను సరిగా నిర్వహించకుండా వ్యాపారం చేస్తున్న కారణంగా రూ.1.62 లక్షల విలువ చేసే 7.22 మెట్రిక్‌ టన్నుల ఎరువులు, 2.24 లీటర్ల పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు. రూ.6,20,942 విలువ గలిగిన 557 లీటర్ల పురుగు మందుల అమ్మకాలను నిలిపేశారు. ఇద్దరు డీలర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్టు చేశారు. తనిఖీల్లో విజిలెన్స్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ వ్యవసాయ అధికారి జె.వాసంతి, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామచంద్రయ్య, స్థానిక వ్యవసాయ శాఖాధికారులు పాల్గొన్నారు.