Oct 05,2023 00:23

ఎరువులు ఎంఆర్‌పి ధరలకే విక్రయించాలి

ఎరువులు ఎంఆర్‌పి ధరలకే విక్రయించాలి
ప్రజాశక్తి-యర్రావారిపాలెం: మండలంలో రసాయనిక ఎరువులు విక్రయిస్తున్న ప్రైవేటు దుకాణాలను మండల వ్యవసాయ అధికారి ఖాదర్‌ భాషా బుధవారం తనిఖీ చేశారు. మండలంలో కొన్ని ప్రైవేట్‌ ఎరువుల దుకాణ యజమానులు ఎంఆర్‌ఫి ధరల కంటే అధికంగా అమ్ముతు న్నారని సమాచారం అందడంతో ఎరువుల దుకాణదారులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు ఎరువులు కొనేటప్పుడు ఎంఆర్‌పి రేట్లు మాత్రమే చెల్లించి ఎరువులు కొనుగోలు చేయాలని తెలిపారు. ప్రతి పంచాయతీలో రైతు భరోసా కేంద్రాలలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులు వినియోగించుకోవాలని ఏవో తెలిపారు.