
మదనపల్లె అర్బన్ : విజిలెన్స్ అండ్ ఫోర్స్ మెంట్ అధికారులు మంగళవారం కురబలకోట మండలంలోని అంగళ్లులో ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.3.20 లక్షలకు పైగా విలువ చేసే ఎరువులను సీజ్ చేసి శ్రీ మహాలక్ష్మి, శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ షాపుల యజమానులపై కేసులు నమోదు చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఐ ఈదురుబాషా కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. కురబలకోట మండలం, అంగళ్లు ఎంబిటి రోడ్డులో ఉంటున్న శ్రీమహాలక్ష్మీ, శ్రీవెంకటేశ్వర ఫర్టిలైజర్స్ షాపుల్లో జిల్లా రీజనల్ విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. ఈ దాడులు అడిషినల్ ఎస్‌పి షేక్ మాసూమ్ బాష ఆదేశాల మేరకు చేపట్టి షాపులను తనిఖీ చేశారు. ఫర్టిలైజర్స్, స్థాకు పరిశీలించారు. ఎరువుల విక్రయాలు, నిల్వల రికార్డులు సరిగా లేని కారణంగా రూ.3.20 లక్షల ఎరువులు సీజ్ చేసి శ్రీ మహాలక్ష్మి ఫెర్టిలైజర్స్ ఆఫ్ యజమానితోపాటు శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ స్టాప్ యజమానిపై కేసులు నమోదు చేశామని తెలిపారు.
ఎరువుల దాకాణంలో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు