Oct 20,2023 23:28

తుళ్లూరు: మండలంలోని వడ్డ మాను,పెదపరిమిలోని ఎరువులు, పురుగు మం దుల దుకాణాలను ఎఒ శ్రీరంజని తనిఖీ చేశారు. దుకాణాల లైసెన్స్‌, నిబంధ నలకు అనుగుణంగా అమ్మ కాలు జరుగు తున్నాయా, లేదా అనే విషయాలపై ఆరా తీశారు. రైతులు అధీకృత డీలర్ల వద్దనే ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయాలని సూచించారు. నిబంధనలు పాటించని దుకాణాదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొన్నూరు రూరల్‌: పొన్నూరు పట్టణంలో ఎరువులు, పురుగుమందులు వ్యాపారం నిర్వహిస్తున్న దుకాణాలను స్థానిక మండల వ్యవసాయ శాఖాధికారి డేగల వెంకట్రామయ్య, పొన్నూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఆర్‌.రామకోటిశ్వరి కలిసి శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేని పురుగుమందులను విక్రయించినా, ఎరువులు అధిక ధరలకు అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూరియా గురించి రైతులు ఎవరు ఇబ్బంది పడాల్సిన పనిలేదని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు, పిఎసిఎస్‌ సొసైటీలలో కూడా సరిపడా యూరియాను నిల్వ చేసినట్లు చెప్పారు. రైతులు దీనిని గమనించి యూరియా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.