ఫొటో : రికార్డులు పరిశీలిస్తున్న జిల్లా అసిస్టెంట్ ఆర్టికల్చర్ అధికారి శ్రీనివాసులు
ఎరువుల దుకాణంలో తనిఖీలు
ప్రజాశక్తి-ఉదయగిరి : ఎరువులు పురుగుమందుల దుకాణాల్లో జిల్లా అసిస్టెంట్ ఆర్టికల్చర్ అధికారి శ్రీనివాసులు తనిఖీ చేశారు. శనివారం స్థానిక దుకాణాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి స్టాకు రిజిష్టర్, బిల్లు పుస్తకాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల స్టాకు కొనుగోలు చేసినపుడు తప్పక రశీదులు ఇవ్వాలని దుకాణ యాజమానులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎరువుల నిల్వలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ఎడిఎ చెన్నారెడ్డి పాల్గొన్నారు.










