Mar 04,2023 00:25
ఇంకొల్లు సాగర్‌ దుకాణంలో తనిఖీలు చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: ఇంకొల్లులోని సాగర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, పవన్‌ ఆగ్రో ఎంటర్‌ ప్రైజస్‌లో దుకాణాల్లో విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. సాగర్‌లో సరుకు నిల్వలకు, పుస్తకాలకు రూ.3.74 లక్షలు తేడా ఉండటంతో ఎరువులు సీజ్‌ చేసి 6ఏ కేసు నమోదు చేశామని విజిలెన్స్‌ ఏఒ వాసంతి తెలిపారు. సాగర్‌ దుకాణానికి సంబంధించి రూ.5.18 లక్షలకు సంబంధించి అమ్మకాలు నిలుపుదల చేశామన్నారు. పవన్‌ దుకాణంలో రూ.5.52 లక్షలు తేడాలున్నాయన్నారు. ఈ దుకాణంపై కూడా 6ఏ కేసు నమోదు చేశామన్నారు. రూ.2.40 లక్షల విలువైన పురుగు మందులు నిలుపుదల చేసినట్లు సిఐ శ్రీహరిరావు వివరించారు. దాడుల్లో ఇంకొల్లు మండల వ్యవసాయాధికారి నార్నె వేణుగోపాల్‌, సిబ్బంది ఉన్నారు.