ఎరువుల దుకాణంలో రికార్డులను పరిశీలిస్తున్న ఎడి నిర్మలజ్యోతి
ప్రజాశక్తి - కురుపాం : జియ్యమ్మవలస మండలం గిజబ గ్రామంలోని లక్ష్మీ ఏజెన్సీ ఎరువుల దుకాణాన్ని సోమవారం వ్యవసాయశాఖ ఎడి ఎ.నిర్మలజ్యోతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలోని ఎరువులను తనిఖీలు చేసి, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్రమంగా ఎరువులు అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
బలిజిపేట : మండలంలో ఎరువుల షాపుల్లో వ్యవసాయ శాఖ ఎడి టి.వెంకటేష్ సోమవారం తనిఖీలు చేపట్టారు. రికార్డుల, నిల్వలు పరిశీలించారు. వివరాలు సరిగ్గా ఉండాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని యజమానులను ఎడి వెంకటేష్ హెచ్చరించారు. కార్యక్రమంలో ఎఒ శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.










