అక్రమంగా నిల్వ ఉంచిన ఎరువులను పరిశీలిస్తున్న వ్యవసాయాధికారులు
ప్రజాశక్తి - బలిజిపేట : ఎరువుల దుకాణాలు, అనధికార నిల్వలను మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ప్రాంతీయ నిఘా అధికారి ఆర్.అప్పలనాయుడు, మండల వ్యవసాయశాఖ అధికారి శ్రావణ్ కుమార్ పి.రావివలసలో తనిఖీలు చేయగా, అక్రమంగా అమ్ముతున్న ఎరువులను (రూ.2,70,282) స్టాక్‌ను సీజ్ చేసి 6-ఎ కేసు నమోదు చేశారు. అలాగే మండలంలోని కొత్తకోట సతీష్ కుమార్ ఎరువుల దుకాణంలో సరైన రికార్డుల్లేక పోవడంతో జిల్లా వ్యవసాయాధికారి ఆదేశాల మేరకు పార్వతీపురం సహాయ వ్యవసాయ సంచాలకులు టి. వెంకటేసు, పార్వతీపురం ఎఒ అశోక్, బలిజిపేట ఎఒ తనిఖీ చేశారు. ఈ తనిఖీలో రూ.28,994 విలువైన స్టాక్ గల యూరియా ఎరువును అమ్మకాలు జరపకుండా నిల్వ చేసినట్లు అధికారులు తెలిపారు.










