ఏరువాకలో పాల్గొన్న ఎమ్మెల్యే కోన
ప్రజాశక్తి-బాపట్ల రూరల్: బాపట్ల మండలం వెస్ట్ పిన్నిబోయినవారిపాలెంలో గురువారం జరిగిన ఏరువాక కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రఘుపతి పాల్గొన్నారు. సందర్భంగా ట్రాక్టర్‌తో దుక్కి దున్ని ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులు పంటలు వేసి మంచి దిగుబడి సాధించాలని అన్నారు. రైతులకు వైసీపి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి సీనియర్ నాయకులు, మండల ఉపాధ్యక్షుడు, పేరలి ఎంపిటిసి కాగిత బుల్లయ్య, షేక్ సుభాని, మాజీ ఎంపీటీసీ గొర్రెముచ్చు మీరయ్య పాల్గొన్నారు.










