Sep 17,2023 00:54

ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్‌
ఎరువు రంగు ప్రాముఖ్యతను గురించి పాఠశాల కరస్పాండెంట్‌ తోటకూర విజయభాస్కర్‌ వివరించారు. మండలంలోని వంకాయలపాడు శ్రీ సాయిరామ స్కూలులో శనివారం ఎరుపు రంగు దినోత్సవాన్ని నిర్వహించారు. ఎరుపు రంగు బలాన్ని, బాద్యతను, పరాక్రమాన్ని, ధైర్యాన్ని ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులు ఎరుపు రంగు దుస్తులతో పాఠశాలకు హాజరయ్యారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.