
ప్రజాశక్తి - బాపట్ల
ఎరుకల హక్కుల సాధనకు ఐకమత్యంతో పోరాడాలని రాష్ట్ర ఎరుకల ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షులు దేవరకొండ శంకరరావు అన్నారు. స్థానిక సంజీవ్ గాంధీ కాలనీలో శుక్రవారం నిర్వహించిన ఎరుకల ప్రజా సంక్షేమ సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరుకల జాతి అభివృద్ధి, హక్కుల సాధనకు ఐకమత్యంతో ఎరుకల తెగ సమాజానికి అవసరమైన సేవలు అందించేందుకు పాటుపడాలన్నారు. ఎరుకల తెగ మూలపురుషుడైన ఏకలవ్యుని విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఎస్టి ఎరుకుల సామాజిక వర్గానికి సంక్రమించే భూ సమస్యలపై పోరాడాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఎదురయ్యే సమస్యలను తమ దృష్టికితెస్తే పరిష్కారానికి సహకరిస్తామని అన్నారు. బాపట్ల జిల్లా అధ్యక్షులు పేరం సాంబశివరావు, గౌరవాధ్యక్షులు పల్లపు బిక్షాలు, ప్రధాన కార్యదర్శి దేవరకొండ పవన్ కుమార్, కోశాధికారి ఇట్ట శ్రీను, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇట్ట ధన కోటేశ్వరరావు, కార్యదర్శి బండి కాళీ కృష్ణ, ఉపాధ్యక్షులు పేరం సుబ్బారావు, గౌరవ సలహాదారు, పేరం వెంకటేశ్వర్లు, మహిళా అధ్యక్షురాలు దేవరకొండ నాగరాజి ఎన్నికయ్యాఆరు. సమావేశంలో కట్టా రామాంజనేయులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవరకొండ రాము పాల్గొన్నారు.