Apr 06,2023 21:31

చలివేంద్రంలో నీళ్లు పోస్తున్న సర్పంచ్‌ శ్వేతకుమారి


ఎర్రగుంట్లలో చలివేంద్రం ప్రారంభం
ప్రజాశక్తి - బండి ఆత్మకూర్‌

       మండలంలోని ఎర్రగుంట్ల గ్రామంలోని బస్టాండ్‌ పరిధిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సర్పంచి కాలూరి శ్వేతకుమారి, పంచాయతీ కార్యదర్శి యశ్వంత్‌ కుమార్‌, వైసిపి సీనియర్‌ నాయకుడు కాలూరి ప్రసాద్‌లు గురువారం ప్రారంభిపంచారు. ఈ సందర్భంగా సర్పంచి ూట్లాడుతూ నంద్యాల-పెసరవాయి ప్రధాన రహదారిలో ఎర్రగుంట్ల గ్రామం బస్టాండ్‌ ఆవరణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ప్రారంభించినట్లు తెలిపారు. ప్రయాణికులు, గ్రామ ప్రజలు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేసవికాలం ఎండలు అధికంగా ఉండడంతో వేసవి తాపాన్ని తీర్చేందుకు గ్రామపంచాయతీ ద్వారా తమవంతు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. నీటిని వృధా చేయకుండా ప్రజలు దాహం తీర్చుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ చలివేంద్రాన్ని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నామని, ఉదయం నుండి సాయంత్రం వరకు మంచినీరు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు చర్యలు చేపటినట్లు తెలిపారు. కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు