ఎర్రచందనం పట్టివేత- స్మగ్లర్ అరెస్టు
ప్రజాశక్తి- యర్రావారిపాలెం:భాకరాపేట అటవీ శాఖ అధికారులకు అందిన రహస్య సమాచారం మేరకు తలకోన అటవీ ప్రాంతంలో నార్త్ బీట్ కాటుక కనుమ సమీపంలో నరబైలు, ఎలమంద ఫారెస్ట్ అధికారులు సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా స్మగ్లర్లు ఎర్రచందనం కొయ్యలు మోసుకొని వెళుతుండగా అటవీ శాఖ అధికారులను చూసి కింద పడి వేసి దట్టమైన అటవీ ప్రాంతంలో పారిపోతుండగా తమిళనాడుకి చెందిన రామనందం, పరుశురాంను పట్టుకున్నామని అధికారులు తెలిపారు. ఈ దాడిలో 9 ఎర్రచందనం దుంగలు పట్టుకున్నారు. వీటి బరువు సుమారు 310 కేజీలు ఉండగా 11 లక్షలు విలువ చేస్తాయని అధికారులు అంచనా వేశారు. పారిపోయిన వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని వారు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.ఈ దాడిలో ఎఫ్ ఎస్ ఓ సలావుద్దీన్,ఎఫ్ బి ఓ లు ప్రదీప్ చాంద్,రాజేష్ , నికిల్,శంకర్, బేస్ క్యాంప్ సిబ్బంది, ప్రొటెక్షన్, వాచర్లు పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్, స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు










