ఆశయాల ధ్వజాన్ని
భుజాలకెత్తుకొని
సుదీర్ఘంగా సాగిన
ఆ.. విప్లవప్రస్థానం
అనన్యసామాన్యం
పట్టణం దాటి
సౌఖ్యాలు దాటి
పుట్టింది తనకోసంకాదని
అణగారిన వర్గాలకోసమని
జీవితాన్ని వారికోసం
సమర్పణంగా
సమర్చనం కావించిన
అఖండ జ్వాల ఆరింది
లావాలా ప్రవహించిన
చైతన్య ప్రవాహం ఆగింది
అడవి తల్లి
బోరున విలపించింది
అవని గుండె బ్రద్ధలైంది
ఆదివాసీల ప్రాణబంధం
తెగిపోయింది
తరానికొక్కడు
యుగానికొక్కడు పుడతాడు
బతుకు పాటను
పోరుబాట చేసుకొనేవాడు
వాడు అమరుడు
వాడు స్మరణీయుడు
అతడు నడిచినచోటు
ఉద్యమం పురుడు పోసుకొంది
అతడు అస్తమించిన సూరీడు
మరణంతో
అరుణపతాక కాంతులతో
కోట్లాది హృదయాల్లో
ఉదయించిన ఎర్రసూరీడు
శ్రీనివాస్ మంకు
89859 90215