Mar 15,2023 23:41

వైద్యులతో మాట్లాడుతున్న కాయకల్ప రాష్ట్ర బృందం

ప్రజాశక్తి - చీరాల : చీరాల ఏరియా వైద్యశాలకు కాయకల్ప రాష్ట్ర బందం సభ్యులు బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా కాయకల్ప రాష్ట్ర అధికారి నిర్మల గ్లోరీ, రాష్ట్ర క్వాలిటీ కన్సల్టెంట్‌ ప్రతినిధి డాక్టర్‌ శామ్యూల్‌, జిల్లా క్వాలిటీ కన్సల్టెంట్‌ ప్రతినిధి కాక్టర్‌ ప్రశాంతి వైద్యశాలలోని ప్రతి వార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డుల్లో పారిశుధ్య తీరు, వసతుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లు, నీటి వసతి, మందులు తదిర మౌళిక వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వైద్యశాల్లో మరిన్ని సేవలందించటంతో పాటు మౌలిక వసతుల కల్పనకు నిధులిచ్చేందుకు కాయకల్ప ఉపయోగపడుతుందని చెప్పారు. ఇక్కడి పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు వారు తెలిపారు. అనంతరం వైద్యశాల సూపరింటెండెంట్‌, వైద్యులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ జివి. శేషుకుమార్‌, ఆర్‌ఎంఒ డాక్టర్‌ సుభాషిణి, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ నిర్మల జ్యోతి, హెడ్‌ నర్సులు మల్లీశ్వరి, బుల్లెమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.