
ప్రజాశక్తి - చీరాల
ఎంఎల్‌ఎ కరణం బలరామకృష్ణమూర్తి జన్మదిన సందర్భంగా పేదలకు సేవలు అందించడం ఎంతో ఆనందంగా ఉంటుందని రోటరీ ప్రెసిడెంట్, కార్యదర్శి రామకృష్ణ, నాగమల్లేశ్వరరావు అన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ నందు క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ అడ్డగడ మల్లిఖార్జున ఆర్థిక సహకారంతో హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ సుభాషిని ఆధ్వర్యంలో పౌష్ఠికాహారం, పండ్లు, బ్రెడ్లు, జుబ్బాలు గర్భిణీలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నన్నపనేని రామకృష్ణ, బాచిన నాగమల్లేశ్వరరావు, పుల్లెల సుబ్రహ్మణ్యం, డాక్టర్ విజయ కుమార్, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ తాడివలస దేవరాజు పాల్గొన్నారు.