Jun 20,2023 23:36

రక్తదానం చేస్తున్న దాతలు

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌: స్థానిక ఏరియా ఆసుపత్రిలో సిపిఎం, సిఐటియు సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. సిపిఎం నేత, కామ్రేడ్‌ సత్తిబాబు జ్ఞాపకార్థం మంగళవారం స్థానిక ఎరియా అసుపత్రి లో రక్తదాన శిబిరం నిర్వహించారు. సిఐటియు నాయకులు అడిగర్ల రాజు మాట్లాడుతూ, నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పోరాడుతున్న సిపిఎం సేవా కార్యక్రమాలు నిర్వహింస్తుందన్నారు., భవిష్యత్‌లో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సుమారు 30 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు బి. స్వాతి, సీనియర్‌ నాయుకులు సాపిరెడ్డి నారాయణముర్తి, ఈరెల్లి చిరంజీవి, కె.రామకృష్ణ, కె.ప్రసన్న, డి.శివ, ఎస్‌. నాగరమణ, జి.రామకృష్ణ, బిసిటివి సిబ్బంది ల్యాబ్‌ టెక్నీషియన్‌ సిహెచ్‌ వెంకటేష్‌, ప్రసాద్‌, రామారావు, సత్యానందం తదిరులు పాల్గొన్నారు.