Aug 10,2023 00:07

యంత్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి అంబటి రాంబాబు

ప్రజాశక్తి - సత్తెనపల్లి టౌన్‌ : స్థానిక ఏరియా వైద్యశాలలో రోగులకు మెరుగైన వసతులు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. స్థానిక ఏరియా వైద్యశాలలో ఈఎస్సార్‌ ఏలైజెర్‌ రక్తపరీక్ష యంత్ర పరికరాలను ఆయన బుధవారం ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఆసుపత్రికి వచ్చే రోగులు రక్తపరీక్షలు కోసం బయట వున్న లాబ్స్‌ను ఆశ్రయించడంతో ఆర్థిక భారంతో బాధపడేదని, తమ ప్రభుత్వ హయాంలో రోగులకు ఆ ఇబ్బంది లేకుండా అన్ని వసతులతో పాటు అన్ని విభాగాలకు వైద్యులను నియమించామని చెప్పారు. ఇప్పటికే ఆసుపత్రిలో 56 రకాల రక్తపరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. రోగుల కోసం క్యాంటీన్‌, ఆస్పత్రి వెలుబల షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేసి వాటి నుండి వచ్చే ఆదాయం ఆసుపత్రి అభివృద్ధికి ఉపయో గించేలా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు.