Oct 16,2023 00:30

పల్నాడు జిల్లా: ఈ నెల 16వ తేదీ నుండి నవంబర్‌ 20వ తేదీ వరకు ఈవీఎంలు, వివి ప్యాట్స్‌ ల ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో పగడ్బంది ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ లోని స్పందన హాలులో ఆదివారం మధ్యాహ్నం ఈవీఎంలు, వివి ప్యాట్స్‌ ల ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ (ఎఫ్‌ఎల్సి)పై సన్నద్ధత, తదితర అంశాలపై సమీక్ష, తహశీల్దార్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లా డుతూ ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుందని చెప్పారు. 24 టేబుల్స్‌ ఏర్పాటు చేస్తారని, ఆయా టేబులల్లో డిటి, పంచాయతి కార్యదర్శి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉం డాలని తెలిపారు. బెల్‌ కంపెనీ నుంచి 12 మంది ఇంజనీర్లు కూడా రానున్నారని అన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్షులు నుంచి ఫొటోలతో ఆథరైజేషన్‌ లెటర్‌ తీసుకురావాలని, వారికి మాత్రమే ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ కి ప్రవేశం ఉంటుందని, ఈ విషయం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు తెలియజేయాలని చెప్పారు. ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు త్వరగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం,ఆర్డిఓ ఎం.శేషిరెడ్డి పాల్గొన్నారు.
ఇవిఎం, వివిపాట్స్‌ కేంద్రంలో తనిఖీ
నరసరావుపేట మార్కెట్‌ యార్డులో భద్రపరిచిన ఎలక్షన్‌ సామాగ్రిని కలెక్టర్‌ శివశంకర్‌ ఆదివారం తనిఖీ చేశారు. ఎలక్షన్‌ ఆఫీసర్‌ తరహాలో మార్కెట్‌ యార్డులోని ఇవిఎం వివి ప్యాడ్‌ భద్రపరిచిన కేంద్రాన్ని ఆయనతనిఖీ చేశారు. 2024 - ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు అన్ని సామాగ్రిని సన్నద్ధం చేయాలని ఇవిఎం, వివి ప్యాట్లు అన్ని సక్రమంగా సరిపడా ఉన్నాయా లేదా అని గమనించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ తో పాటు , జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం,ఆర్డీఓ ఎం. శేషిరెడ్డి, తహ శీల్దార్‌ రమణ నాయక్‌ ఆయా శాఖల అధికారులు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.