Oct 26,2023 20:44

గోడౌన్‌లో ఎఫ్‌ఎల్‌సి ప్రక్రియను తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన ఎఫ్‌ఎల్‌సి ప్రక్రియను ఎలాంటి తప్పులు లేకుండా పటి ష్టంగా నిర్వహించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాయచోటి మార్కెట్‌ యార్డ్‌ ఆవరణలో ఉన్న గోడౌన్‌లో భద్రపరచిన ఇవి ఎంలను, అక్కడ జరుగుతున్న ఎఫ్‌ఎల్‌సి ప్రక్రియను కలెక్టర్‌ ఆకస్మికంగా పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. ఉదయం 9 గంటల నుంచి ఎఫ్‌ఎల్‌సి ప్రక్రియ ప్రారం భించామని డ్వామా పీడీ, ఇవిఎంల జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ ఎం.సి.మద్దిలేటి కలెక్టర్‌కు వివరించారు. ఎఫ్‌ఎల్‌సి ప్రక్రియకు హాజరవుతున్న సిబ్బంది, బెల్‌ ఇంజినీర్లు, పొలిటికల్‌ పార్టీల హాజరు పట్టికలు, నిర్దేశించిన అనెక్సర్లు 3, 5, 11, 12, 13, 14 లను, అక్కడి ఏర్పాట్లను కలెక్టరు పరిశీలించారు. అనంతరం ఇవిఎంల పనితీరు, వాటిని తనిఖీ చేస్తున్న వివరాలను అక్కడి బెల్‌ ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడి వారి సందేహాలను నివత్తి చేసి పలు సూచనలు చేశారు. ఇవిఎం గోడౌన్‌ను పరిశీ లించారు. ఎఫ్‌ఎల్‌సి హాల్‌ వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబి రాన్ని తనిఖీ చేశారు. అవసరమైన మందులన్నీ సిద్ధంగా ఉంచు కోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. జిల్లాలో ఎఫ్‌ఎల్సి ప్రక్రియ నిబంధనల మేరకు పక్కగా నిర్వహించాలని ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వరాదని కలెక్టర్‌ పేర్కొన్నారు. కార్యక్ర మంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, తహశీల్దార్‌ ప్రేమంత్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గంగప్రసాద్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు, బెల్‌ ఇంజినీర్లు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.