Mar 10,2023 22:54

ప్రజాశక్తి - తిరువూరు :దేశంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ వ్యతిరేక వి ధానాలకు, అధిక ధరలు, ప్రయివేటీక రణ, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకా లు, తదితర అంశాలపై దేశ ప్రజలను ఐక్యం చేస్తూ ఏప్రిల్‌ 5వ తేదీన నిర్వ హించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వ్య వసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోట కళ్యాణ్‌, ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గువ్వల సీతారామిరెడ్డి పిలుపునిచ్చారు. తిరువూరు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం సిఐటియు, రైతు, కౌలు రైతుసంఘాలు, వ్యవసాయ కా ర్మిక సంఘం ఆధ్వర్యంలో ఐక్య సద స్సు కౌలు రైతుసంఘం మండల కార్య దర్శి ఎం. ప్రభాకరరావు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక, కర్షక హక్కులు సాధించుకునేందుకు ఛలో ఢిల్లీ ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26,000 అమలు చేయాలని, రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని, ఉపాధి కూలీలకు 200 రోజుల పనిదినాలు కల్పించాలని, స్కీంవ ర్కర్లకు గ్రాటివిటీ ఇవ్వాలని, పర్మినెంట్‌ ఉద్యోగులుగా గుర్తించాలని, నిత్యవసర సరుకులపై జిఎస్టి ఎత్తివేసి ధరల ని యంత్రణ చట్టం తీసుకురావాలని, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయా లని, ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వమే సమర్థవంతంగా నడపాలని తదితర డిమాండ్లపై ఛలో ఢిల్లీ నిర్వ హిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష, కార్యద ర్శులు మరకాల ఇశ్రాయేలు, బలగాని వెంకటేశ్వరావు, రైతుసంఘం మండల కార్యదర్శి సాంబారు వెంకటేశ్వర్లు, రైతుసంఘం నాయకులు నీలపాల వలరాజు, ప్రకాశరావు తిరువూరు అంగన్వాడి ప్రాజెక్టు కార్యదర్శి నాగ మణి, కష్ణకుమారి, ముఠా వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు ఎం. బాబు, రామారావు తదితరులు పాల్గొన్నారు.