విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఎంఇఒ
ఎప్పటికప్పుడు సరి చూడాలి
ప్రజాశక్తి-ఉదయగిరి:అన్ని తరగతుల విద్యార్థుల వర్క్ బుక్స్ ఎప్పటికప్పుడు సరి చూడాలని మండల విద్యాశాఖ అధికారి 1 షేక్ మస్తాన్ వలి పేర్కొన్నారు. బుధవారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉదయగిరి ఉర్దూ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గౌరవ విద్యాశాఖ అధికారి అన్ని తరగతుల విద్యార్థుల అభ్యసన, పఠన సామర్థ్యాలను పరిశీలిస్తూ విద్యార్థుల సామర్ధ్యాలు వారి తరగతి స్థాయి కంటే తక్కువగా ఉన్నవని, ప్రత్యేక తరగతులు,శిక్షణ ఇచ్చి వారి తరగతిస్థాయి సామర్ధ్యాలను పెంచాలన్నారు. విద్యార్థుల వర్క్ బుక్స్ పరిశీలిస్తూ కొంతమంది విద్యార్థుల వర్క్ బుక్స్ సరి చూడకపోవడంతో అన్ని తరగతుల విద్యార్థుల వర్క్ బుక్స్ ఎప్పటికప్పుడు సరి చూడవలెనని, విద్యార్థులు వర్క్ బుక్స్ లో ఎక్కడైతే తప్పుగా రాశారో అక్కడ సరి చూసి విద్యార్థికి ఆ సమస్య, సందర్భం గురించి వివరించా లన్నారు. పాఠశాలలో ఖాళీగా గదులు ఉండడంతో మధ్యాహ్న భోజనాన్ని అక్కడే తయారు చేయాలని మధ్యాహ్న భోజన నిర్వాహ కులకు ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న స్థలాన్ని తన సొంత నిధులు రూ.15వేలు వెచ్చించి విద్యార్థుల ఆట స్థలం గా తయారుచేసిన ప్రధానోపాధ్యాయులు కరీంని అభినం దించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.