ఎపిపిజి సెట్ -2023 సమస్యలపై స్పందించని అధికారులు: ఎస్‌ఎఫ్‌ఐ
ప్రజాశక్తి - క్యాంపస్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎపి పిజి సెట్‌లో ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నా అధికారులు స్పందించక పోవడం చాలా దారుణమని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర యూనివర్శిటీ విద్యార్థుల కన్వీనర్ ఎన్. మాధవ కష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పిజి సెట్ కి సంబంధించి సర్టిఫికెట్ అప్లోడ్, వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ ప్రక్రియలలో కొన్ని సాంకేతిక సమస్యలు, మరికొన్ని వ్యక్తిగతమైన తప్పిదాలు కారణంగా విద్యార్థులు పిజి సెట్ అధికారులు ఇచ్చిన హెల్ప్ డెస్క్ మెయిల్, ఫోన్ నెంబర్ లను రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు సంప్రదిస్తున్నా ఎటువంటి ప్రతి స్పందన అధికారుల నుండి లేదని వాపోయారు. సెట్ అధికారులు స్పందించకపోవడంతో ఉన్నత విద్యామండలి అధికారులను సంప్ర దిస్తు న్నా వారి నుండి కూడా మౌన మే సమా ధానంగా వస్తోం దని బాధ్యతా యుతమైన అధికారులు స్పందించ కపోతే విద్యార్థులు భయాందో ళనలకు గురవుతున్నా రని పేర్కొన్నారు. రిజిస్ట్రేష న్, వెబ్ ఆప్షన్స్ గడువు పొడిగించాలని ఉన్నత విద్యా మండలి అధికారులకి వినతిపత్రం ఆన్ లైన్ ద్వారా పంపామని అధికారులు స్పందించకపోతే అన్ని యూనివర్సిటీ లలో ప్రత్యక్ష ఆందోళనలకు పిలుపునిస్తామని హెచ్చరించారు.










