
రాయచోటి టౌన్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ కన్వీనర్ పూల భాస్కర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ప్రధాన మంత్రి అయిన వెంటనే తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైల్‌పైనే పెడతారని చెప్పారు. బిజెపిని నిలదీసి ప్రత్యేక హోదా సాధించలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా రాజధాని చూపించలేదని తెలిపారు. బిజెపి కనుసనల్లో అధికార వైసిపి, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉన్నాయని చెప్పారు. 9 సంవ త్సరాలు బిజెపి అధికారంలో ఉండి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేక పోయిందని విమర్శించారు. బిజెపికి ఊడిగం చేస్తున్న ఈ మూడు పార్టీలు కూడా రాష్ట్రం నుంచి వెళ్లి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం రాహుల్ గాంధీ తొలి సంతకమే పెడతానని ఒక సమావేశంలో చెప్పారన్నారని గుర్తు చేశారు. వైసిపి వలన కక్ష సాధింపు తప్ప రాష్ట్రం అభివద్ధి శూన్యమని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనన్నారు. బిసిసి జనగణనకు ఏకగ్రీవ తీర్మానం చెప్పడం కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్ జిల్లా అధ్యక్షుడు శెట్టిపల్లి సన్నీ, గోల్డ్ అల్లా బకష్, డిసిసి మైనార్టీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు ఆడిటర్ మన్సూర్ అలీ ఖాన్, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీక్, డెలిగేట్ మహమ్మద్ గౌస్, పట్టణ అధ్యక్షుడు శర్వాణి ఫారుక్, దర్బార్ బాష, యహియాబాష, మాజీ డిసిసి కార్యదర్శి ఖదీర్, మన్సూర్ విక్టోరిస్ పాల్గొన్నారు.