మాట్లాడుతున్న సిద్ధంరెడ్డి మోహన్‌రెడ్డి
ఎపికి జగనే ఎందుకు కావాలంటే..
ప్రజాశక్తి-మర్రిపాడు: మండలం చిలకపాడు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని ఎంపీడీఓ నాగమణి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల సచివాలయాల కన్వీనర్ సిద్ధం రెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ సచివాలయానికి ప్రభుత్వం పలు పథకాల కింద రూ.15కోట్లను మంజూరు చేసిందన్నారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయాలు, ఏర్పాటు చేసి ప్రజలు మండల కార్యాలయాలు చుట్టూ తిరగకుండా సచివాలయంలో త్వరగా పనులు జరిగగేలావాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు.పేదలకు పలు సంక్షేమ పధకాలు ద్వారా డిబిటి నాన్ డిబిటి స్కీముల ద్వారా సచివాలయం పరిధిలోని లబ్ధిదారులకు అందించిన నగదు వివరాలు లబ్ధిదారుల సంఖ్య తెలిపే సంక్షేమ డిస్ప్లే బోర్డు ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శెట్టిసముద్రం గ్రామంలో నూతన దేవాలయం నిర్మాణానికి ప్రభుత్వం నుండి రూ.10లక్షలను ఎమ్మెల్యే మంజూరు చేయించారన్నారు.విద్యార్థులకు అమ్మఒడి, విద్యాదీవెన, అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు.2024ఎన్నికల్లోఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. మండలంలో రైతులకు 122సాగునీటిబోర్లు మంజూరయ్యాయని, ప్రస్తుతం పొలాల్లో డ్రిల్లింగ్ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైసీపీ కన్వీనర్ బొర్రా సుబ్బిరెడ్డి, సర్పంచ్ సిద్ధం రెడ్డి రమాదేవి, మాజీ కన్వీనర్ శ్రీనివాసులు నాయుడు, భీమవరం సొసైటీ చైర్మన్ మాధవరెడ్డి, అల్లంపాడు సచివాలయ కన్వీనర్ మౌలాలి, వైసీపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ చెవులశ్రీనివాస్ యాదవ్, కల్లూరు జనార్ధన్ వాలంటీర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.