Nov 15,2023 21:47

ఫొటో : మాట్లాడుతున్న సచివాలయ కన్వీనర్‌ షేక్‌.మౌలాలి

'ఎపికి జగనే ఎందుకు కావాలంటే..'
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని అల్లంపాడు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని సచివాలయ కన్వీనర్‌ షేక్‌.మౌలాలి ఆధ్వర్యంలో నిర్వహించగా, మాజీ కన్వీనర్‌ గంగవరపు శ్రీనివాసులు నాయుడు జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పేదలకు జగనన్న అందించే సంక్షేమపథకాలు లబ్థిదారులకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అందిన నగదు వివరాలను ఈఓపిఆర్డి మస్తాన్‌ ఖాన్‌ డిస్‌ప్లేలో చూపించి వివరించారు. రూ.13కోట్లను అల్లంపాడు సచివాలయ పరిధిలోని లబ్ధిదారులకు అందించామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ముస్లీం సోదరులకు రూ.23,176 కోట్లను అందించారన్నారు. కార్యక్రమంలో మండల వైసిపి కన్వీనర్‌ సుబ్బిరెడ్డి, ఎంపిడిఒ నాగమణి, ఉప సర్పంచ్‌ వెంగల్‌ రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, చండ్ర నారాయణస్వామి, సచివాలయ సిబ్బంది, సచివాలయం కన్వీనర్‌లు, గృహసారథులు, వలంటీర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.