Nov 06,2023 00:31

ప్రజాశక్తి-గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఎపిజిఇఎ) మహిళా ఉద్యోగుల విభాగం నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఆదివారం నగరంపాలెంలోని సంఘం జిల్లా కార్యాలయంలో కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలకు జిల్లా ఉపాధ్యక్షులు శ్యాంకుమార్‌ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర ఆర్గనైన్‌ సెక్రటరీ జి.నాగసాయి, మహిళా విభాగం చైర్‌పర్సన్‌ సుగుణ హాజరయ్యారు. మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎల్‌.పద్మావతి, కార్యదర్శి యు.సుమిత్రాదేవి, సహాధ్యక్షురాలుగా పి.హేమలత, జిల్లా కోశాధికారిగా శేషుకుమారి, కార్యనిర్వాహక సెక్రెటరీగా రమణ తదితరుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన సభ్యులను, జిల్లా అధ్యక్షులు చాంద్‌బాషా, రాష్ట్ర పరిశీలకులు జి.నాగసాయి, సుగుణ సన్మానించారు. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పద్మావతి, సుమిత్రాదేవి అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ కరీముల్లా శాఖాద్రి, ఉపాధ్యక్షులు శ్యామ్‌కుమార్‌, నగర అధ్యక్షులు వై.నాగేశ్వరరావు, కార్యదర్శి సాంబశివారెడ్డి పాల్గొన్నారు.