
ప్రజాశక్తి - పంగులూరు
ఏపీటీఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులుగా తన్నీరు వెంకట్రావు, షేక్ రహమతుల్లా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ సభ్యులు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విద్యావిధానం వలన పిల్లలు, ఉపాధ్యాయులు తీవ్ర వొత్తిడికి గురవుతున్నారని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎ శేఖర్‌బాబు అన్నారు. రూ.వేల కోట్లు విద్యారంగంపై ఖర్చు చేస్తున్నట్లు ప్రజలలో భ్రమ కల్పిస్తున్నారని అన్నారు. వేల సంఖ్యలో స్కూళ్లు మూసేస్తున్నారని అన్నారు. ప్రపంచంలో ఎక్కడ పాఠశాల హెచ్‌ఎంలకు బాత్రూం ఫోటోలు తీసే బాధ్యత లేదని అన్నారు. ఒక్క ఎపిలో మాత్రమే అమలు జరుగుతుందని తెలిపారు. ఆధునిక సాంకేతిక వైపు అడుగులు వేస్తూనే విద్యారంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి వడివడిగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఆరోపించారు.