Jun 04,2023 01:26
గోడపత్రికను ఆవిష్కరిస్తున్న తహశీల్దార్లు, వీఆర్వోలు

ప్రజాశక్తి-అద్దంకి: ఏపిజెఏసి అమరావతి 4వ ప్రాంతీయ సదస్సు ఈ నెల 8వ తేదీన గుంటూరులో జరుగుతుందని తహశీల్దారు జిబి సుబ్బారెడ్డి శనివారం తెలియజేశారు. ఈ ప్రాంతీయ సదస్సుకు ఉద్యోగులను సమాయత్తం చేసేందుకు అద్దంకి తహశీల్దారు వారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోడ పత్రికను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా చైర్మన్‌ సిహెచ్‌ సురేష్‌బాబు, ఉపాధ్యక్షులు ఎం సత్యనారాయణ, ఇంకొల్లు తహశీల్దారు బ్రహ్మయ్య, కొరిసపాడు డిప్యూటీ తహశీల్దారు, విఆర్‌ఓలు, విఎస్‌ పాల్గొన్నారు.