May 17,2023 00:34
పరీక్ష రాసి వెళ్లిపోతున్న విద్యార్థినులు

ప్రజాశక్తి-వేటపాలెం: సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, చీరాలలో ఎపిఇఎపి సెట్‌-2023 పరీక్షలు 15-05-2023 సోమవారం నుంచి కళాశాల టిసిఎస్‌ ఐయాన్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్నారని కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి కళాశాలలో, ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మశీ కోర్సులలో అడ్మీషన్ల కోసం నిర్వహించే ఎపిఇఎపి సెట్‌-2023 పరీక్షలు ఈ సంవత్సరం జెఎన్‌టియు, అనంతపురం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న ఎపిఇఎపి సెట్‌-2023 పరీక్షలు ఎంపిసి వారికి కళాశాలలోని టిసిఎస్‌ ఐయాన్‌ సెంటర్‌లో మే 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు, బైపిసి వారికి 22 నుంచి 23 వరకు రోజుకు 2 షిఫ్టులలో ఆన్లైన్‌లో నిర్వహిస్తున్నారని కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్‌ మొయిద వేణు గోపాలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా విద్యాశాఖ వారి నిబంధనలను అనుసరించి విద్యార్థులను ఉదయం 7.30 గంటల నుంచి 9.00 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3 గంటల వరకు పరీక్షా కేంద్రంలోనికి అనుమతిస్తామని తెలిపారు. ఎస్‌సి ఎస్‌టి అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్ద తమ కుల ధృవీకరణ పత్రాలను సమర్పించాలని తెలిపారు. 215 మందికి గాను 208 మంది మధ్యాహ్నం 215 మందికి గాను 208 మంది మొత్తం 430మంది అభ్యర్థులకు గాను 416 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు. ఈ పరీక్షలకు డాక్టర్‌ కె శ్రీనివాసరావు పరిశీలకులుగా విచ్చేశారు. డాక్టర్‌ విడి అనిల్‌ కుమార్‌, డెప్యూటీ సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తున్నారు.