ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర కార్యదర్శిగా అశోక్ రెడ్డి
ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర కార్యదర్శిగా అశోక్ రెడ్డి
ప్రజాశక్తి- తిరుపతి(మంగళం): రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న తిరుపతి అర్బన్ డిప్యూటీ తాహశీల్దార్ మిట్టపల్లి అశోక్ రెడ్డి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసి యేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా నియ మితు లయ్యారు.ఈ మేరకు విజయవాడలో రెండు రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి రెవెన్యూ ఉద్యోగుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శిగా అశోక్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అసోసియేషన్‌కు నూతన కార్యదర్శిగా ఎన్నికైన అశోక్ రెడ్డిని రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ ప్రత్యేకంగా అభినందించి జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులు అశోక్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.










