ప్రజాశక్తి-కంచికచర్ల
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డెయిరీ మాజీ డైరెక్టర్, విజయడైరీ మాజీ జనరల్ మేనేజర్ వేమా రాఘవరావు (82) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. కంచికచర్ల కు చెందిన ఆయన ఉన్నత చదువులు చదివి విజయడైరీలోనూ, ఏపీ డెయిరీ లోనూ ఉన్నతోద్యోగిగా చేసి పదవీ విరమణ చేశారు. అనంతరం కుటుంబంతో విజయవాడ లో నివాసం ఉంటున్నారు. కొంత కాలంగా అనారోగ్యానికి గురైన ఆయన విజయవాడ లో ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఆయనకు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. కొడుకు అమెరికా లో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నాడు. కంచికచర్ల మాజీ సర్పంచ్ దివంగత వేమా నరశింహారావు కు రాఘవరావు స్వయానా సోదరుడు, కంచికచర్ల మాజీ ఏఎంసీ ఛైర్మన్, సొసైటీ అధ్యక్షుడు కాలవ వెంకటేశ్వర రావు ( పెదబాబు) కు స్వయానా బావ.ఆయన మత దేహాన్ని కుటుంబ సభ్యులు కంచికచర్ల లోని స్వగహానికి తరలించారు. రాఘవరావు మతి పట్ల మాజీ హౌం మంత్రి వసంత నాగేశ్వరరావు, నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు తదితరులు సంతాపం తెలిపారు. మాజీ ఎంపిపి మల్లెల పుల్లయ్య బాబు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ బొమ్మిశెట్టి భాస్కరరావు,. ప్రముఖ వైద్యులు, డాక్టర్ పుల్లగూర ప్రభాకరరావు, వైసిపి నాయకులు కాలవ వాసుదేవరావు, తదితరులు మృత దేహాన్ని సందర్శించి, పూల మాలలు వేసి నివాళులర్పించారు










