Oct 02,2023 23:57

ఏపీ భవిష్యత్తును అక్రమ రిమాండ్‌ పేరుతో జైల్లో పెట్టారు..

ఏపీ భవిష్యత్తును అక్రమ రిమాండ్‌ పేరుతో జైల్లో పెట్టారు..
ప్రజాశక్తి- చిట్టమూరు: ఇంటింటికి బాబుతో నేను కరపత్రాల పంపిణీలో నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధికార ప్రతినిధి నాగార్జున గూడూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్‌ పాశం సునీల్‌ కుమార్‌ ఆదేశాల మేరకు, చిట్టమూరు మండల టీడీపీ అధ్యక్షులు గణపర్తి కిషోర్‌ నాయుడు సూచనల మేరకు గూడూరు నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధికార ప్రతినిధి, మహాజన సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లసిరి నాగార్జున ఈశ్వర వాకలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ కక్షతో చంద్రబాబు నాయుడు గారు ను అక్రమ రిమాండ్‌ పేరుతో ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్‌ చేసి ఇన్ని రోజులు జైల్లో పెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధం అన్నారు. అవినీతికి పాల్పడిన జగన్‌ మోహన్‌ రెడ్డి పది సంవత్సరాల నుండి బెయిల్‌ పై బయట ఉన్నారని, ఏ తప్పు చేయని చంద్రబాబును జైల్లో పెట్టడం ఈ ప్రభుత్వం కక్ష సాధింపు అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు , బూత్‌ కన్వీనర్లు పాల్గొన్నారు.