Nov 18,2022 22:51

ప్రజాశక్తి-నందిగామ 

ఎపియన్జిఓస్‌ అసోసియేషన్‌ నందిగామ తాలూకా యూనిట్‌ లో ఎలక్షన్‌ నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం జరిగింది. ఒక్క ప్యానల్‌ నుండి మాత్రమే నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్‌ వేసిన ప్యానల్‌ ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు ఎలక్షన్‌ అధికారులు జిల్లేపల్లి స్వామి , కె.సంపత్‌ కుమార్‌ లు ప్రకటించారు. ఎపియన్జిఓస్‌ నందిగామ తాలూకా యూనిట్‌ అధ్యక్షులుగా యం. శ్యామ్‌ బాబు, కార్యదర్శి గా షేక్‌ భాషు, కోశాధికారి గా వి.యలమందయ్య, సహ అధ్యక్షుడుగా వై వీరపాల్‌, ఉపాధ్యక్షులు గా షేక్‌ . అబ్దుల్‌ షరీఫ్‌, ఎమ్‌. సాయిరామ్‌ డి.జనార్ధన్‌, కార్యదర్శులుగా ఎ. పుట్టి, ఎ. సివలాల్‌, జె.గంగరాజు మహిళా సహాయ కార్యదర్శిగా షేక్‌ ఇష్రత్‌ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నుతనంగా ఎన్నికై కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ యూనిట్‌ పరిధిలోని ఉద్యోగులకు సంబంధించిన ఏ అంశాన్ని అయిన ఈ నాయకత్వం దృష్టికి తీసుకు వస్తే పరిష్కరించడానికి సిద్దంగా ఉందాలని అసోసియేషన్‌ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల యూనిట్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.వి. శివారెడ్డి ఏమ్‌.భిక్షాలు, ఉద్యోగులు పాల్గొన్నారు.